అఖియప్రియ దంపతుల అరెస్టు
1 min read
మాజీమంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు, భర్త భార్గవరామ్‌ను కూడా బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
బోయిన్‌పల్లిలో బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్ లో అఖిలప్రియ దంపతుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెపుతున్నారు. బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఇంట్లో ఉన్న ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావును రాత్రి 7.20 గంటల సమయంలో 15 మంది దుండగులు అపహరించారు. మూడు కార్లలో వారి ఇంటికి వెళ్లిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ముగ్గురు సోదరులను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్, ఫోన్లను కూడా పట్టుకుపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల సాయంతో 12 గంటల్లోనే కిడ్నాప్ ను చేధించడం విశేషం. అయితే కిడ్నాప్ వ్యవహారంలో భూమా అఖిలప్రియ దంపతులను ప్రమేయంపైన పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.