జైలుకు బండి సంజయ్

1 min read

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన 14 రోజుల రిమాండ్ కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో బీజేపీ శ్రేణులు షాక్ లో ఉన్నారు. కరోనా నిబంధనలను అతిక్రమించి నిరసన సభ నిర్వహించడానికి బండి సంజయ్ ప్రయత్నించారంటు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఉపాధ్యాయ బదిలీల తీరును తప్పుపడుతు జన జాగరణ కార్యక్రమానికి బండి సంజయ్ పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్టు పైన బీజేపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా స్పందించారు. బండికి అండగా ఉంటామన్నారు. సంజయ్ బెయిల్ కోసం బీజేపీ వర్గాలు హైకోర్టును ఆశ్రయించనున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn