దిగజారి సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ నీచ ప్రచారం..

**హైదరాబాద్:**
దిగజారి సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ నీచ ప్రచారం చేయిస్తున్నాడని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. మహిళలను అంటగడుతు రెండు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ సోషల్ మీడియా అనైతిక ఫోస్టులు పెడుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోబీఆర్ఎస్ తీరును బల్మూర్ వెంకట్ ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేక కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. మహిళలను కించపరిచేలా, అక్రమ సంబంధాలు అంటగడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు.కేటీఆర్ తన సొంత కుటుంబంలోని మహిళలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు మహిళల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు.సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు, అవమానకరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బల్మూర్ వెంకట్ కోరారు. ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.గతంలో తాము చేసిన ఫిర్యాదులపై పోలీసు శాఖ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఏ విధంగా పెరిగాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా వివరించారని అన్నారు.సిరిసిల్లలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో కేటీఆర్ స్టార్ హోటళ్ల వ్యవహారాన్ని బయటపెట్టారని బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. ఆస్తుల వ్యవహారంపై కేటీఆర్ సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారని అన్నారు.కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆస్తులపై కాంగ్రెస్ నేతలు కేవలం ఆరోపణలు చేయలేదని, ఆధారాలు చూపించారని బల్మూర్ వెంకట్ అన్నారు. ఆ ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, మహిళలను అవమానించే ప్రచారాన్ని నిలిపివేయాలని ఆయన సూచించారు.
#KTR #RevanthReddy #BalmoorVenkat #TelanganaPolitics #TelanganaNews #BRS #Congress #TelanganaPoliticalNews #RevanthReddyNews #KTRNews #Telangana #VSRBreakingNews
