కేటీఆర్‌పై కవిత ఘాటు విమర్శలు.. నాతో పెట్టుకోవద్దంటూ హెచ్చరిక!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీలో అవినీతిని ప్రశ్నించినందుకే తనను కొన్ని గంటల్లోనే సస్పెండ్ చేశారని పేర్కొంటూ, కేటీఆర్ వ్యవహారశైలిపై ప్రశ్నల వర్షం కురిపించారు.తాను పార్టీలోని ఓ అవినీతి నాయకుడిని విమర్శించినందుకే సస్పెండ్ చేశారని, అదే నాయకుడితో అంటకాగుతూ పార్టీ అధినేత కేసీఆర్ తీరుతోనే నష్టపోయామని కేటీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించడం పార్టీ వ్యతిరేక చర్య కాదా? అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శించడం, ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పుపట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా? అని నిలదీశారు.ఫామ్‌హౌస్‌లు, అక్రమంగా ఇచ్చిన అనుమతులు, ఆంధ్రా మిత్రులకు ఇచ్చిన నజరానాలు, క్విడ్ ప్రో కో వ్యవహారాలతో బీఆర్ఎస్‌ను పాతాళంలోకి నెట్టింది కేటీఆర్ కాదా? అంటూ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఓ రైతు ఫోన్‌లో మాట్లాడుతుంటే ఆయన భార్యను ఉద్దేశించి అహంకారపూరితంగా మాట్లాడారని, సాయం కోరుతూ వచ్చిన ఓ మహిళతోనూ అవమానకరంగా వ్యవహరించారని కవిత విమర్శించారు.ఓ నాయకుడి మైండ్ గేమ్‌లో కేటీఆర్ పూర్తిగా పడిపోయారని, పార్టీ పెద్దమనిషి అయిన కేసీఆర్‌నే తప్పుబడుతూ బీఆర్ఎస్‌కు గోతులు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలో తన వైఫల్యాలను, చేతగానితనాన్ని పార్టీ అధినేతపై మోపుతున్నారని విమర్శించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గణేష్ నిమజ్జనోత్సవంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంతమందిని బతిమాలుకున్నారో గణేష్ మహారాజుకు, కేటీఆర్ అంతరాత్మకు తెలుసని కవిత వ్యాఖ్యానించారు.తాను ఇతరుల మాటలు విని మాట్లాడే వ్యక్తిని కాదని, నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడతానని స్పష్టం చేశారు. విషనాగుల మాటలు విని మాట్లాడనని, తనతో పెట్టుకోవద్దంటూ కేటీఆర్‌ను హెచ్చరించారు.

 

#Kavitha #KTR #KavithaVsKTR #BRS #KCR #BRSInternalDisputes #TelanganaPolitics #BRSNews #TelanganaNews #PoliticalNews #VSRBreakingNews #Todaysbreaking.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn