ULC పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: ప్రజల భూ సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.GO 455, GO 456, GO 747, GO 92 కింద పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు Memo No. 48062 జారీ చేసినట్లు వెల్లడించింది.2016లోనే ULCకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటి అమలులో జాప్యం జరిగిందని పేర్కొంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన కేసులను పరిశీలించి, నిబంధనల మేరకు క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

22-A సమస్యల పరిష్కారంపై ఫోకస్

ప్రజలకు ఇబ్బందిగా మారిన 22-A సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.GO 118, GO 76లకు అనుగుణంగా 22-A జాబితాలో ఉన్నప్పటికీ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది.తాజాగా ULC పెండింగ్ దరఖాస్తులపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడంతో, అర్హత ఉన్న భూ కేసుల పరిష్కారానికి మార్గం సుగమమైంది. మిగిలిన 22-A సమస్యలను కూడా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

 

#TelanganaNews #BreakingNews #ULC #ULCPendingCases #ULCApplications #UrbanLandCeiling #LandIssues #TelanganaLandIssues #LandRegularisation #22A #22AProblems #TelanganaGovernment #RevanthReddy #CMRevanthReddy #PonguletiSrinivasReddy #RevenueDepartment #HyderabadLandIssues #HyderabadPropertyNews #TelanganaPropertyNews #TelanganaLatestNews #TelanganaBreakingNews #LandProblems #LandRegistration #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn