ఉప్పల మల్సూర్ కుటుంబ దీనస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ కుటుంబ దీనస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే ఆ కుటుంబానికి రెండు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు.

దీంతో సూర్యాపేట కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ప్రతులను అందజేశారు. కలెక్టర్ స్వయంగా మల్సూర్ కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఉప్పల మల్సూర్ కుటుంబ సభ్యులకు సరైన ఇల్లు కూడా లేదని ఒక దినపత్రికలో కథనం రావడంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు.

సీపీఎం పార్టీ తరఫున మల్సూర్ నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కూడా తీసుకోలేదు. అత్యంత నిజాయితీపరుడిగా మల్సూర్ పేరుగాంచారు.ఆయన కుటుంబం ప్రస్తుతం రాజకీయాల్లో లేదు.

 

#CMRevanthReddy #RevanthReddy #UppalaMalsur #CPMLeader #UppalaMalsurFamily #IndirammaIllu #IndirammaHouses #TelanganaCM #TelanganaNews #TelanganaPolitics #RevanthReddyNews #TelanganaGovernment #CPM #FormerMLA #VSRBreakingNews

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn