కొండా సురేఖ వివాదంపైన స్పందించొద్దు..

మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. సచివాలయంలో తనను కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలని, అందుకు కావాల్సిన నిధులను గ్రీన్ ఛానల్‌లో అందిస్తామని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 7 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు అంతా హాజరై చర్చల్లో పాల్గొనాలని అన్నారు. ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని అంశాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని అన్నారు.
