కేటీఆర్ చిట్ చాట్ .. రేవంత్ రెడ్డిపైన చిటపట

*నది జలాల విషయంలో తెలంగాణ హక్కులకు భంగం కలిగితే జల ఉద్యమం – కేటీఆర్*
నది జలాల హక్కులకన్నా ముఖ్యమైనది ఇంకేమీ లేదు
వచ్చేవారం జరిగే జి ఆర్ ఎం బి సమావేశం ఎజెండా ఎందుకు అంగీకరించారు ప్రభుత్వం స్పష్టం చేయాలి
ఈ సమావేశం ఎజెండా పూర్తిగా తెలంగాణ హక్కులను కాల రాస్తుంది
తెలంగాణ హక్కులను ఏ విధంగా కాపాడతారో ముఖ్యమంత్రి మరియు ఉత్తంకుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి
ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఈ సమావేశాన్ని బహిష్కరించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉంది…అందుకే నది జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు
అధికారంలోకి రాగానే హిల్ట్ పీ పాలసీని రద్దు చేస్తాము
ప్రజల సొమ్మును అప్పనంగా కొట్టేయాలని ప్రభుత్వం కుట్రజేస్తుంది
5 లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టారు
హిల్ట్ పీ పాలసీ రద్దు తర్వాత ఇప్పుడు రెగ్యులరైజ్ చేయించుకున్న వాళ్ళు నష్టపోవడం ఖాయం
ప్రజల సొమ్మును రేవంత్ రెడ్డితో కుట్ర చేసి దక్కించుకుంటాం అనుకున్న పారిశ్రామికవేత్తలు నష్టపోవడం ఖాయం
హిల్ట్ పీ పాలసీ పైన ప్రజలను జాగ్రత్త చేసేలా కార్యాచరణ చేపడుతాం
నిషేధిత జాబితాలో భూములను ప్రజల ఆస్తులను పెట్టి రేవంత్ రెడ్డి పొంగులేటి గజదొంగల మాదిరిగా దోచుకుంటున్నారు
నంది నగర్ నివాసంలో మీడియా రిపోర్టర్లతో కేటీఆర్ కామెంట్స్
జిఆర్ఎంబీ (GRMB) సమావేశం ఎజెండాను ఒప్పుకున్నారా? ఈ సమావేశానికి హాజరైతారా? హాజరైతే తెలంగాణ ప్రజల తరఫున ఏం చెప్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
ఈ విషయంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఈ జల ఉద్యమం వస్తది. తెలంగాణ నీటి హక్కులకు మించిన మరో ప్రాధాన్యత మా పార్టీకి లేదు. నదీ జలాల్లో కేంద్రమైనా, రాష్ట్రమైనా నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తే, తెలంగాణ ఉద్యమానికి మించి మరొక ఆందోళన తెలంగాణలో వస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఎజెండాను ఒప్పుకొని ఎలా మీటింగ్‌కి హాజరవుతుంది? ప్రభుత్వానికి సిగ్గు ఉంటే… ఈ ప్రభుత్వానికి సమావేశానికి ఎలా హాజరవుతారో ప్రభుత్వం చెప్పాలి. తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్ ని సలహాదారుగా పెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య. తెలంగాణలో ఒక్క ఇంజనీర్ కూడా లేరా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చెప్పుచేతల్లోకి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు చెప్పుచేతల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. రెవంత్ రెడ్డికి సిగ్గుంటే ఆదిత్యనాథ్ దాస్ ని తొలగించాలి. నీళ్లు, నిధులు, నియామకాలతో కొట్లాడిన తెలంగాణలో మరోసారి నీళ్ల దోపిడీకి తెలంగాణ గురవుతున్నది. ఇదే జరిగితే కచ్చితంగా బిఆర్ఎస్ మరోసారి నీళ్ల కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది.
నదుల నుంచి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తిపోసుకుంటే… ముఖ్యమంత్రికి కనీసం సోయి లేదు.
మేము లక్షల మంది రైతులతో వెళ్లి పంపులు ఆన్ చేస్తామంటేని ఈరోజు పంపులని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లా అని, మా పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి పాలమూరు నీళ్లు ఇచ్చే సోయి లేదు. మహబూబ్ నగర్ బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నీళ్లు ఇచ్చే సోయి లేదు. వర్షాలు పడి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తి పోసుకుంటే ముఖ్యమంత్రికి కనీసం సోయి లేదు. ప్రధాన ప్రతిపక్షం ముళ్ళు కట్టెతో పొడిస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది లేదంటే నిద్రపోతున్నది.
యాగాలు చేస్తే తప్పు లేదు కానీ… యాగాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి తన బాధ్యతలు నిర్వహించాలి. కానీ, ప్రజలకు సంబంధించి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన కష్టాలను పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, నీళ్లు ఎప్పుడు ఎత్తిపోయాలో కనీస అవగాహన లేదు. పాలమూరు జిల్లా బిడ్డ అని చెప్పుకునే రేవంత్ కనీసం అక్కడికి చెరువులలో నీళ్లు నింపడానికి కూడా సోయి లేదు. సాగునీటి ప్రాజెక్టుల పైన తెలంగాణకు నష్టం జరిగేలా ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను అంగీకరిస్తున్నారా లేదా అన్నది కాంగ్రెస్ ఇప్పటిదాకా స్పష్టం చేయలేదు.
క్షుద్రపూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సిగ్గుపడాలి. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం త్యాగాలు చేసినవాళ్ళం. క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం మాకు లేదు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం. కాంగ్రెస్ లాగ పార్టీ క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదు. హరీష్ రావు గుడికి పోతే తప్పా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా? కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డకు, చెక్ డ్యామ్ లోనూ ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదు. నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే కాంగ్రెస్ సంస్కృతి మాది కాదు. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారుడికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ సబ్ స్టేషన్‌కైనా రావడానికి మేము సిద్ధం. 24 గంటల కరెంట్ వస్తే ఇంకా ఎక్కడ ఉందో చెప్పాలి. కనీసం ఐదు, ఆరు సార్లు ప్రతిరోజూ కరెంట్ కోతలు అవుతున్నాయి.
అధికంగా బోనస్, పెన్షన్లు… అధిక బోనస్ చెల్లిస్తాము అని, అనేక ఇతర హామీలు చేస్తాము, అమలు చేస్తామంటే అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ, అవన్నీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. పక్క రాష్ట్రం నదుల నుంచి నీళ్లు ఎత్తుతుంటే రేవంత్ రెడ్డికి ఇంకా సోయి లేదు. చేయాల్సిన పనులు చేయకుండా కేవలం దేవుడి పైన భారం వేస్తా అంటే ఆయన కూడా హర్షించడు.
ఇక్కడ ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక హైకోర్టు ప్రభుత్వాన్ని హైడ్రా విషయంలో అభిశంసన ఇచ్చిన తీరుగా ఎప్పుడూ చేయలేదు.
ప్రభుత్వ అధికారులపైన నమ్మకం లేదు, ఆర్మీని ఈ రంగంలోకి దించుతామని అంత ఘాటుగా ఎప్పుడూ చెప్పలేదు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అసమర్థతకు, వైఫల్యానికి నిదర్శనం. హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోను అంటే ముఖ్యమంత్రికి న్యాయస్థానాల పైన ఉన్న గౌరవం ఏంటో తెలిసిపోయింది. కోర్టులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజాస్వామికవాదులు గుర్తించాలి. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానాన్ని గుర్తించాలి. రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పుకున్నట్లే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదు.
ప్రజలను విపత్తుల నుంచి రక్షించడానికి ఈవీడియం అనే సంస్థను పెట్టాం. దాని పేరు మార్చి ప్రజల్ని విపత్తుల్లోకి, విధ్వంసంలోకి నెట్టేలా హైడ్రాని తయారు చేశారు. పేదలను కొట్టి పొందిన 2500 ఎకరాల భూమిని సేకరించి వాటిని పెద్దలకు అమ్ముతామని ప్రభుత్వం చెబుతుంది. పేదలను కొట్టి పెద్దవాళ్లకు దోచిపెట్టడమే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి చేస్తున్న పని. గతంలో మా ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల మందికి 58 జీవో ద్వారా పట్టాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క పట్టా అయినా ఇచ్చిందా? పైగా వేలాది మంది ఇళ్లను కూలగొట్టారు.
*Hilt P policy పై కేటీఆర్ కామెంట్స్*
హైదరాబాద్ లోని 10,000 ఎకరాల విలువైన భూమి పారిశ్రామిక భూముల విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న 5 లక్షల కోట్ల స్కామ్ పైన రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తామని కేటీఆర్ అన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో ప్రజల సొమ్మును కాజేసే కుట్రను రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఈ అంశాన్ని ఎండగడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వేల కోట్ల రూపాయల సొమ్ములను దండుకునేందుకు తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రతి ఒక్క పారిశ్రామిక ఆర్గనైజేషన్ కి లేఖలు రాస్తామని తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజల సొమ్మును ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జేబులో వేసుకుంటుందో ప్రజలందరికీ అర్థమయ్యేలా లేఖల రూపంలో, ప్రజెంటేషన్ ల రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజల విలువైన ఆస్తిని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.
గతంలో బాంబే మరియు ఇతర నగరాల్లో పారిశ్రామిక భూములను ప్రభుత్వం తీసుకొని తిరిగి రీడెవలప్మెంట్ చేసిన ఉదంతాలను కాదని ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా పాత భూముల ధరలకు కట్టబెట్టే కుట్రను రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఈ పాలసీ వలన ఎవరైనా భూములను రెగ్యులరైజ్ చేయించుకుంటే భవిష్యత్తులో తీరని నష్టం జరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ఒక్క ఎకరం భూమి అందుబాటులో లేదని, చివరికి ఆట స్థలాలకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, చివరికి స్మశానాలకు కూడా భూములు లేని హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వ్యక్తులకు 10,000 ఎకరాల భూమిని దోచిపెట్టడం తీరని ద్రోహమన్నారు. ఒకప్పుడు ప్రజల ఆస్తిని పరిశ్రమల కోసం ఇచ్చారని, కేవలం పరిశ్రమలు మాత్రమే నడపాలని, అంతేకానీ మాల్స్ కట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే సరైంది కాదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ స్కామ్ పైన హైకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లి జరుగుతున్న అక్రమాలను వారి ముందు ఉంచుతామని కేటీఆర్ తెలిపారు. గత లో మా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక భూములను ఐటి, సెజ్ ల పేరిట డెవలప్ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఐటి పరిశ్రమను నగరం నాలుగు మూలలా విస్తరించాలన్న లక్ష్యంతో పాలసీని తీసుకువస్తే దాన్ని మార్చి అప్పనంగా అమ్ముకునేలా హిల్ట్ పాలసీని రేవంత్ రెడ్డి రూపొందించారని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే కాకుండా ప్రజల వ్యక్తిగత ఆస్తుల పైన కూడా రేవంత్ రెడ్డి కన్నేసి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కేవలం 16 లక్షల లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉంటే దాన్ని కోటి 20 లక్షలకు చేర్చి ప్రైవేట్ వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ భూ కబ్జ బ్లాక్ మెయిలింగ్ దందాకు ప్రభుత్వం తెరలేపిందన్నారు. ఇప్పుడు కొత్తగా 22ఎ పేరుతో హైదరాబాద్ నగరంలోనూ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసేలా లక్షల మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. కాలనీలకు కాలనీలను నిషేధిత జాబితాలో పెట్టి తమ సొంత కష్టార్జితంతో సంపాదించుకున్న 100 గజాలను కూడా అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసి బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన పాలసీ నిర్ణయం అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో లక్షల ఆస్తులను ఈ నిషేధిత జాబితాలో పెట్టి వారి నుంచి డబ్బులు వసూలు చేయాలన్న దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. డబ్బులు ఇస్తేనే ఇన్ఓసీలు ఇచ్చేలా ఈ కొత్త నిర్ణయం తీసుకొని ప్రజల నుంచి ముక్కుపిండి భారీగా కోట్ల రూపాయలు వసూలు చేసే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ధరణి పేరు మార్చి దాని ద్వారా నిషేధిత జాబితాలో పెట్టి అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ చెప్పలేనన్ని భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. పొంగులేటి మరియు రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు పంచుకుంటున్నారన్నారు.
ముఖ్యమంత్రి గజదొంగ మాదిరి…. పొంగులేటి చిన్న దొంగ మాదిరి ఇద్దరు కలిసి దొంగలుగా మారి తోడు దొంగలై…. మంత్రివర్గం అంతా ప్రజల సొమ్మును కాజేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రజల భూమిని చెరబట్టి ఇండ్లను కూలగొట్టి వారి ఆస్తులని అప్పనంగా మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు విద్వంసం సృష్టించారన్నారు. హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పిన రేవంత్ రెడ్డి హిట్లర్ మాదిరే ప్రజల సొమ్మును, ఆస్తులను గుంజుకుంటున్నారన్నారు. చివరికి గ్రేహౌండ్స్ భూములను, మూసి భూములను వదలకుండా హెరిటేజ్ రాక్స్ ఉన్న రాయదుర్గం భూములను సైతం వదిలిపెట్టడం లేదన్నారు. వరుసగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన భూ కుంభకోణాలను 22ఎ పేరిట జరుగుతున్న భూదోపిడిని, హిల్ట్ పాలసీ స్కామ్ ని అన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో తాను చెప్పినట్లుగానే టిడిఆర్ హక్కులను అప్పనంగా కొని తర్వాత తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి పదుల రెట్లు అధిక ధరకి ఇప్పుడు బలవంతంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముకుంటూ వందల కోట్ల రూపాయల స్కామ్ కి తెరలేపారన్నారు. ఒకప్పుడు ఎల్ఆర్ఎస్ భూములను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల దగ్గర భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. నో బిఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్ అంటూ ఎన్నికలలో హామీ ఇచ్చి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారన్నారు.
