తప్పుడు ప్రచారం మానుకో..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తప్పుడు ప్రచారం మానుకోండి
. కట్టు కథ లతో బట్ట కాల్చి మీద వేయ డ మే హరీష్ రావు పని
– తొలుత కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పు
– ఏపీ కి అమ్ముడుపోయి విమర్శలు
– నెలాఖరులో సమ్మక్క సాగర్ కు noc
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
12 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టు లను వ్యతిరేకిస్తుందని, ఇది కొత్త విషయం కాదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రాజెక్ట్ లకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన brs పార్టీ నేతలు అధికారం కోల్పోగానే కడుపు మంట తో బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి విరుచుకు పడ్డారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో బీఆర్ ఎస్ ఏ రోజు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదు. బీఆర్ ఎస్ అధికారం లో ఉన్న సమయంలో నే రాయల సీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగింది వాస్తవం కాదా..? పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయింది బిఆర్ ఎస్ హయాంలో కాదా అని ప్రశ్నిచ్చారు. పట్టి సీమ ఎత్తిపోతల పథకం మీ రు అధికారంలో ఉండగా పూర్తి కాలేదా అని ప్రశ్నించారు. తొమ్మిదినారేళ్ళు తెలంగాణ సొమ్ము ను లూటీ చేసి… అధికారం కోల్పోగానే మొసలి కన్నీరు కారుస్తూ న్నారు అని మండిపడ్డారు.
ఈ నెల 18 వ తేదీన జరిగే
18 GRMB మీటింగ్లో అజెండా లో చేర్చ బడిన అంశాలు కొత్థవేమి కాదు. ఇవే అంశాలను మునపటి మీటింగులలో మరియు కరెస్పాండన్స్ లలో కూడా AP ప్రతి సారి ప్రస్తావిస్తూ వస్తున్నది. ఇవే అంశాలు సీతారామ ఎత్తిపోతల పథకం క్లియరెన్స్ విషయం లో కూడా AP ప్రస్తావించింది. దీని పైన ఈ ప్రభుత్వం ధీటుగా స్పందించి అవన్నియు కూడా నిరాధారమైనవని GRMB కి మరియు CWC కి దృష్టికి తీసుకువెళ్లి SSMP – SRLIP TAC క్లియరెన్స్ (158 మీటింగ్ తేదీ : 24.04.2025) విజయవంతంగా అనుమతులు సాధించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, AP రాష్ట్రం నిరంతరం GRMB, CWC మరియు జలశక్తి మంత్రిత్వ శాఖకు కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వరాదని కోరుతూ వచ్చింది. MoJS ద్వారా TAC క్లియరెన్స్ పొందిన తరువాత కూడా సమీక్షించాలని AP ప్రతి మీటింగ్ నందు ప్రస్తావిస్తున్నది.
ఈ సందర్భంలో చెప్పదగ్గ విషయం ఏమిటంటే, AP లేవనెత్తిన అటువంటి అంశాలను ఈ ప్రభుత్వం ధీటుగా ప్రతిఘటించి మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడడంలో సఫలీకృతుమైనది.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభత్వం ఎటువంటి ఉదాసీనత ప్రదర్శించుట లేదు. ఈ సందర్బంగా ప్రస్తావంచడం ఏమిటి అనగా గత BRS ప్రభుత్వమే ౩వ GRMB మీటింగ్ నందు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించి, ఆయా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరాలి లేదా ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి అని తన వైఖరి ద్వార స్పష్టం చేసింది. ఈ రెండు రాష్ట్రాలకు నీటి సరఫరా నియంత్రణను GRMB ప్రారంభించే ముందే ఈ షరతులలో ఏదో ఒకటి నెరవేరాలని ఆ ప్రభుత్వం పేర్కొంది.
ఇదే విషయాన్నీ పునర్ఘటిస్తూ, గత BRS ప్రభుత్వం 2nd APEX కౌన్సిల్ మీటింగ్లో (06.10.2020) ట్రిబ్యునల్ ఏర్పాటు కొరకు AP రాష్ట్రం తో పోటీ పడి కోరడం జరిగింది.
ఈ ప్రభుత్వం సమయస్ఫూర్తి తో అడుగులు వేసి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఏర్పడకుండా అడ్డుకుందన్నారు.
ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత.
అంతర్రాష్ట్ర వ్యవహారాల (ISM) డైరెక్టరేట్ క్లియరెన్స్ మరియు IP క్లియరెన్స్ పొందడంలో గత ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ముంపు సమస్యకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఆ రాష్ట్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు.
ప్రస్తుత ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని చాలాసార్లు సంప్రదించి / సందర్శించి, ISM డైరెక్టరేట్ క్లియరెన్స్ పొందడం కోసం ముంపు సమస్యకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ నుండి నిరభ్యంతర పత్రం (NOC) పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే noc కోసం మూడుసార్లు ఛత్తీష్ గడ్ సీఎం ను కలిసి noc కోసం విజ్ఞప్తి చేశాం. నెలాఖరులో noc ఇస్తామని సీఎం చెప్పారు. మీరు అధికారం లో ఉండగా ఒక్క సారి అయినా ఛత్తీష్ గఢ సీఎం ను కలిశారా అని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభ్యంతరాలను సమర్థవంతంగా ప్రతిఘటించి రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి బహులార్దా సాధ క సీతమ్మ సాగర్ – సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు TAC అనుమతులు 24.04.2025 సాధించింది. తొమ్మిదినారేళ్లలో చేయలేని పని చేసాం. 60 టీఎంసీ ల నీటి కేటాయింపులు సాధించాం . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా ట్రిబ్యునల్ ఏర్పరిచే విషయంలో కూడా ఈ ప్రభుత్వం సమయస్ఫూర్తి తో అడుగులు వేసి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఏర్పడకుండా అడ్డుకుంది .
ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత.
PBLP ప్రతిపాదన గురించి తెలిసిన తర్వాత ఈ ప్రభుత్వం వెనువెంటనే స్పందించడం జరిగింది.
ఇప్పటివరకు ముఖ్యమంత్రి రెండు సార్లు నీటిపారుదల శాఖ మంత్రి గా నేను ఏడు సార్లు , పది సార్లు ప్రధాన కార్యదర్శి , ENC(G) 19 సార్లు వంటి వివిధ స్థాయిల అధికారుల ద్వారా MoF, MoJS, MoEF&CC, CWC, GRMB, KRMB మరియు PPAలతో సుదీర్ఘమైన ఉత్తరప్రత్యుత్తరాలు జరపబడ్డాయి.
న్యాయపరమైన చర్యలో భాగంగా, ప్రభుత్వం గౌరవనీయ సుప్రీమ్ కోర్ట్ ముందు ఒరిజినల్ సూట్ మరియు IA వాజ్యాలు వేయడం జరిగింది.
ప్రతివాదులందరూ 4 వారాల్లోగా తమ సమాధానాలను దాఖలు చేయాలని గౌరవనీయ న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
2018-2022 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతానికి 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినప్పటికీ, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితం కాలేదా? అని నిలదీశారు .
ఆర్డీఎస్ లో వాటా మేరకు నీళ్ల కోసం ఏ రోజు బీఆర్ ఎస్ ప్రయత్నం చేయలేదు. ఆర్డీఎస్ ఆధునీకరణ విషయం లో ఏపీ, కర్ణాటక సీఎం లను ఒప్పించాం. మీరు ఏ రోజైనా కర్ణాటక సీఎం ను కలిసి ఒప్పించారా అని నిల దీ శారు.
kwdt లో కృష్ణా జలాల వాటా కోసం స్వయంగా విచారణ కు హాజరై న్యాయ నిపుణులతో సూచన చేశా.
గత ప్రభుత్వం కంటే సమర్థ వంతంగా వాదనలు వినిపిస్తున్నాం.
రాష్ట్ర ప్రజల నీటి హక్కులను పరిరక్షించి, కాపాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.
బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అనే సిద్ధాంతం కలిగిన brs ద్వంద విధానాలతో మేము నేర్చుకోవాల్సి సింది ఏమీ లేదు.
తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో ఏపీ కాంట్రాక్టర్ లనుంచి ముడుపులు అందాయనే కవిత ఆరోపణ లకు జవాబు చెప్పు. అ ముడుపుల్లో నీ వాటా ఎంత.
తెలంగాణ లో అధికారం లో రావడం లేదని ఏపీ తో కుమ్మక్కై నాగార్జున సాగర్ ప్రాజెక్టు ను వివాదం చేసింది మీరు కాదా.?
రూ లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ను నిండా ముంచి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తా వా అని మంత్రి నిలదీశారు
