కేసీఆర్ కుటుంబ క‌బ్జాల‌పైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే.. బండి సంజ‌య్

హైదరాబాద్: సిద్దిపేట భూముల వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న పర్యటనలు, భూముల వ్యవహారంపై చేస్తున్న ఆరోపణలు రాజకీయ డ్రామాలేనని ఆయన విమర్శించారు. భూముల అక్రమాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో.. ఆధారాలు ఉంటే వెంటనే భూములను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

“అసలు మీ దగ్గర ఆధారాలున్నాయా? లేక రాజకీయ డ్రామాలకు తెరలేపారా?” అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిద్దిపేట భూముల అంశాన్ని రాజకీయంగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతల భూములపై విచారణ జరిపించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో భూదోపిడీ, అవినీతి జరిగిందని ఆరోపించిన బండి సంజయ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయంగా తేడా లేదని వ్యాఖ్యానించారు.

 

బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూవ్యవహారాలు, అవినీతి అంశాలపై విచారణ జరిపిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

అంతేకాకుండా, సిద్దిపేటలో అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు నిర్ధారణ అయ్యే భూముల్లో పేదలకు ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అక్కడ కాషాయ జెండాలు పాతుతామని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

#BandiSanjay #BandiSanjayKumar #Siddipet #SiddipetLandIssue #SiddipetPolitics #TelanganaPolitics #TelanganaNews #BJP #BJPTelangana #KCR #HarishRao #BRS #Congress #RevanthReddy #TelanganaBJP #LandIssue #LandEncroachment #TelanganaPoliticalNews #SixGuarantees #BandiSanjayNews #KCRLandIssue #HarishRaoLandIssue #SiddipetNews #TelanganaLatestNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn