పేద విద్యార్థికి లక్ష సాయం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

వరంగల్: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విద్యార్థినికి వైద్య విద్యను కొనసాగించేందుకు TPCC SC డిపార్ట్మెంట్ ఆర్థిక సహాయం అందించింది. వరంగల్ జిల్లా చెన్నారెడ్డిపల్లి లేబర్ కాలనీకి చెందిన వడ్డేపల్లి రహేల్ MBBS విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో ఆమె కుటుంబానికి ఈ సహాయం అందించారు.

రహేల్ తండ్రి వడ్డేపల్లి ఎల్లస్వామి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, విద్యార్థిని వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి స్పందించిన TPCC SC డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ రూ.1,29,500 ఆర్థిక సహాయం అందించారు.

ఈ మేరకు రూ.1,29,500 (ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు) విలువైన చెక్కును విద్యార్థిని రహేల్‌కు అందజేశారు.ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నారు. ముఖ్యంగా వైద్య విద్య వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన సమయంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.రహేల్ తన MBBS విద్యను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేసి, భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె విద్యకు తన వంతు సహాయం కొనసాగిస్తానని తెలిపారు. అంతేకాకుండా రహేల్ పూర్తి చదువుకు అవసరమైన పుస్తకాల బాధ్యతను కూడా తానే స్వీకరిస్తానని హామీ ఇచ్చారు.విద్యార్థిని భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయంతో పాటు పుస్తకాల బాధ్యతను కూడా స్వీకరించిన డా. కవ్వంపల్లి సత్యనారాయణకు రహేల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

 

Hashtags

#KavvampalliSatyanarayana #DrKavvampalliSatyanarayana #ManakondurMLA #TPCC #TPCCSCDepartment #TelanganaCongress #MBBS #MBBSStudent #EducationSupport #FinancialAssistance #MedicalEducation #StudentSupport #Warangal #WarangalNews #TelanganaNews #CongressTelangana #EducationNews #TelanganaLatestNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn