బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్Bankipur Bypoll Result

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టించారు. జన సురాజ్ దెబ్బతో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీకి ప్రశాంత్ కిషోర్ గట్టి షాక్ ఇచ్చారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ కమలం పార్టీకి కోలుకోలేని దెబ్బ తీశారు. జన సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌ను ఓడించారు. ఏకంగా 19,324 ఓట్ల భారీ మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ బంకీపూర్‌లో విజయం సాధించారు.
పాట్నా నగరంలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గమైన బంకీపూర్ 1990 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నితిన్ నబిన్ వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపికైన ఆయనను పార్టీ అధిష్ఠానం రాజ్యసభకు పంపడంతో ఈ ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
