పొన్నం ప్రభాకర్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి

బోనాల సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అనేక మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఫోటోలు దిగారు.
