వర్షాలపైన సీఎం రేవంత్ రెడ్డి హై అలర్ట్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోని ఉన్నతాధికారులు హై అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని తేల్చి చెప్పారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు.వాతావరణ శాఖ సూచనల ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా బృందాలను మోహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
