సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల యాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపైన దృష్టి సారించారు. ప్రాజెక్టు దగ్గర కు స్వయంగా వెళ్లి పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. రెండు రోజుల పర్యటనలో ఇప్పటికే ఆయన నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు గూడెందొడ్డి రిజర్వాయర్, JNLIS STAGE-1 పంప్‌హౌస్‌ను కూడా ముఖ్యమంత్రి సందర్శంచారు. వీటితో పాటు సోమశిల దగ్గర అధికారులతో సమీక్ష జరిపారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు.
రెండో రోజు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్‌హౌస్ ను సందర్శిస్తారు. తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్, ఎంజీకేఎల్‌ఐఎస్ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లను పరిశీలిస్తారు. పీఆర్ఎల్ఐఎస్కు చెందిన కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15 పనులను పరిశీలిస్తారు. సాయంత్రం జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పరిశీలించిన అనంతరం భారీ బహిరంగసభలో పాల్గొంటారు.

