కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ ను ఆయన పరిశీలించి సమీక్ష జరుపుతారు. తర్వాత కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తారు. రాత్రి కొడంగల్ లోనే బస చేయనున్న సీఎం ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సర్ తో పాటు ఇతర అంశాలపైన ఆయన కార్యకర్తలతో మాట్లాడనున్నారు.
