కేర‌ళంలో రేవంత్ మ్యాజిక్

కేర‌ళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘ‌న‌విజ‌యం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు కొంత ఊర‌ట క‌ల్గింది. అయితే కేర‌ళం లో కాంగ్రెస్ విజ‌యం వెనుక తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాత్ర పైన ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. కేర‌ళం సీపీఎం ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ పైన రేవంత్ రెడ్డి విరుచుకుప‌డిన తీరు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇండియా కూట‌మిలో సీపీఎం భాగ‌స్వామి అయిన‌ప్ప‌టికి రేవంత్ రెడ్డి సూటిగా విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ ప్ర‌చార తీరు మారిపోయింది. కేర‌ళం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం రెట్టింపు అయింది

నీ పో మోనే విజయ‌న్‌.. యువ‌ర్ టైమ్ ఈజ్ ఓవ‌ర్ (విజ‌య‌న్ నీ స‌మ‌యం అయిపోయింది.. వెళ్లిపో ) అంటూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగ్‌ను కేర‌ళం ప్ర‌జ‌లు పూర్తిగా ఆహ్వానించారు. అందుకే విజ‌య‌న్‌ను ఇంటికి పంపించి కాంగ్రెస్‌ను గెలిపించారు. కేర‌ళం ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌లు రోడ్ షోల్లో పాల్గొన‌డంతో పాటు కార్న‌ర్ మీటింగ్‌ల్లో ప్ర‌సంగించారు. కేర‌ళం కాంగ్రెస్ మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డినే విడుద‌ల చేశారు. తెలంగాణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని అక్క‌డి మేనిఫెస్టోలో చేర్చ‌డంతో మ‌హిళ‌లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.క‌మ్యూనిస్టు విజ‌య‌న్‌.. క‌మ్యూనలిస్టు మోదీ మ‌ధ్య తేడా లేద‌ని కేర‌ళ ప్ర‌జ‌ల‌కు సీఎం వివ‌రించారు. మోదీ.. విజ‌య‌న్ ల మ‌ధ్య ర‌హ‌స్య స్నేహాం ముంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు . విజ‌య‌న్‌.. మోదీని బ్ర‌ద‌ర్స్‌గా రేవంత్ రెడ్డి వ‌ర్ణించ‌డం కూడా కేర‌ళం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

*కేర‌ళం మాజీ ముఖ్య‌మంత్రులు ఆంటోనీ, ఊమెన్ చాందీ, క‌రుణాక‌ర‌న్‌ల గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తు, వారి ప‌రిపాల‌న‌లో సాధించిన విజ‌యాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేర‌ళం ప్ర‌జ‌ల‌కు గుర్తు చేశారు. కేర‌ళంలో లెఫ్ట్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్‌)కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసిన‌ట్లేన‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేర‌ళ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం గా వివ‌రించారు.
కేర‌ళంలో జాతీయ ర‌హ‌దారులు స‌హా ప‌లు అభివృద్ధి ప‌నులు నిలిచిపోయినా పిన‌రాయి విజ‌య‌న్ ప‌ట్టించుకోకపోవ‌డం,విజ‌య‌న్ హ‌యాంలో చోటు చేసుకున్న బంగారం స్మ‌గ్లింగ్ ఇత‌ర కేసుల్లో ఈడీ, మోదీ ప‌ట్టించుకోక‌పోవ‌డాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లేవ‌నెత్తాడు.

కాంగ్రెస్ గెలిస్తే విద్యావంతులైన కేర‌ళం యువ‌త‌కు కేర‌ళ‌లోనే ఉపాధి క‌ల్పిస్తామ‌ని.. వారు విదేశాల‌కు వెళ్ల‌కుండా చూసే బాధ్య‌త యూడీఎఫ్ తీసుకుంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. విజ‌య‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఎన్నిక‌ల‌కు ముందు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ‌లు కేర‌ళంలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఆ లేఖ‌లు యూడీఎఫ్ విజ‌యానికి ఎంతో దోహ‌ద‌ప‌డ్డాయి.

తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ.21 వేల కోట్ల రుణ‌మాఫీ చేయ‌డం, 67 వేల‌కుపైగా ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డం.. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించ‌డం, 200 యూనిట్ల‌లో ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేయ‌డం… ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం వంటివి అమ‌లు చేస్తుండ‌డం… వాటిని కేర‌ళ ప్ర‌చారంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్ప‌డంతో అక్క‌డి ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పై మ‌రింత విశ్వాసం క‌లిగింది..
ఏ విధంగా చూసినా తెలంగాణ‌లోని కాంగ్రెస్ పాల‌నా, తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌చారం ఇవ‌న్నీ కేర‌ళం కాంగ్రెస్ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn