సీబీఐ విచారణ ప్రకటించిన తర్వాతే మోదీ హైదరాబాద్ కి రావాలి

ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ చేపడుతారా లేదా తేల్చాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో అవినీతిని తేల్చాలని కోరుతు సీబీఐ కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి 9 నెలలు గడిచిపోయినా స్పందన లేదని ఆయన అన్నారు. ఎందుకు సీబీఐ విచారణ చేపట్టడం లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేయాలని మహేష్ గౌడ్ అన్నారు. కాళేశ్వరాన్ని సీబీఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ ను అరెస్టు చేస్తామని గతంలో కిషన్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని మహేష్ గౌడ్ విమర్శించారు. బీజేపీ గెలిపించడం కోసం బీఆర్ఎస్ తన ఓట్లను మల్లించిందన్నారు. వరి వేస్తే ఉరే నని అన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదంటు ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.
.
