కవిత పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీలోకి చేరికలు ప్రారంభమ్యాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కవిత పార్టీలో చేరారు. గతంలో బీఆర్ఎస్ తరుపున రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరారు. అనేక జిల్లాల నుంచి కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కవిత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న ఉద్యమ కారులు కొత్త పార్టీ వైపు చూస్తున్నారని ఆమె అన్నారు. ఉద్యమకారులు ఒక్కటి కావాలి,ఏ స్పిరిట్ తో తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలని కవిత పిలుపునిచ్చారు.
