తెలంగాణకు పట్టిన శని బీజేపీ

తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిప్పులు చెరిగారు.తెలంగాణ ఏర్పాటు పైన ఇప్పటికి బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ను పాకిస్తాన్ తో పోల్చి బెంగళూరు బీజేపీ ఎంపి తేజస్వీ సూర్య తక్షణమే క్షమాపణ చెప్పాలని వేముల డిమాండ్ చేశారు.తేజశ్వీ సూర్య లోక్ సభ లో తెలంగాణ పట్ల కాలకూట విషాన్ని చిమ్మాడని ఆయన ధ్వజమెత్తారు.2014 నుంచి 2023 వరకు అనేక సార్లు ప్రదాని మోదీ తెలంగాణ ఏర్పాటు పైన వ్యాఖ్యలు చేశారన్నారు.తల్లిని చంపి బిడ్డను బతికించారని గతంలో మోదీ మాట్లాడిన మాటలను మరిచిపోలేదన్నారు.తెలంగాణ ఏర్పాటు బీజేపీ కి ఇష్టం లేదని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అన్న వేముల వీరేశం ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయాడని నిప్పులు చెరిగారు.
