రాహుల్ తో రేవంత్ రెడ్డి, మంత్రుల భేటీ

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలతో మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వర్గ సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు. గత రెండున్నర ఏళ్లలో ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్తు కార్యాచరణ పైన ఈ సమావేశంలో చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ లను అధిష్టానం అభినందించింది.
