పలుకరింపులు లేని జగన్, షర్మిల
1 min read
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపుల పాయలో ఆయన కుటుంబ సభ్యులు నివాళ్లర్పించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, ఎపి సిఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధి దగ్గర పక్కపక్కనే ఉన్నప్పటికి జగన్, షర్మిల కనీసం ఒకరి మొఖం ఒకరు చూసుకోలేదు. షర్మిల కుమారుడు, కూతురుని కూడా సిఎం జగన్ పలుకరించలేదు. ప్రార్థన తర్వాత షర్మిల వెళ్లిపోగా జగన్ ఒక్కరే కొద్దిసేపు అక్కడ ఉన్నారు. గత కొంత కాలంగా జగన్, షర్మిల మధ్య పలుకరింపులు లేవు. విభేదాల కారణంగా షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీతో తమకు సంబంధం లేదని జగన్ ఇప్పటికే ప్రకటించారు.