ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్ట్
1 min readసిఎం కేసీఆర్ అవినీతిపైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తు వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో చంద్రశేఖర్ రావు కోట్లాది రూపాయలను దోచుకున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ పెద్దలు కేసీఆర్ అవినీతిపైన ఎందుకు విచారణ జరిపించడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతిపక్షాలు తనతో కలిసి రావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. పార్లమెంటు వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించిన వైఎస్ షర్మిలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.