రాజకీయాల్లో కొనసాగుతా
1 min readరాజకీయాల్లోనుంచి తప్పుకోవడం లేదని మాజీ పీసీసీ చీఫ్,నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఉత్తమ్ ఖండించారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోవడంతో త్వరలోనే తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తన కామెంట్స్ ను వక్రీకరించారని ఆయన చెపుతున్నారు.