ఆ 12 మంది జంపింగ్ ఎమ్మెల్యేలపైన కాంగ్రెస్ కేసు

1 min read

పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలను వదిలిపెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రలోభాల వల్ల పార్టీ మారిన వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్ణయించారు. మెయినాబాద్ పోలీస్ ష్టేషన్ లో పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ మారడం ద్వారా 12 మంది ఎమ్మెల్యేలకు జరిగిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఫిర్యాదుతో పాటు జత చేయనున్నారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసిందంటు టీఆర్ఎస్ మెయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. దీనిపైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే తమ ఎమ్మెల్యేలను వివిధ రకాలుగా ప్రలోబాలకు గురి చేసి టీఆర్ఎస్ చేర్చుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే ఫాంహౌజ్ ఆపరేషన్ ఎక్కడ జరిగిందో అక్కడే 12 మంది ఎమ్మెల్యేలపైన కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

https://youtube.com/live/BWhL5Ob_okQ?feature=share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn