రాహుల్ గాంధీతో మైనంపల్లి భేటీ
1 min readకాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తన కుమారుడు రోహిత్ తో కలిసి ఆయన రాహుల్ తో భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా రాహుల్ తో సమావేశమయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో మైనంపల్లి, వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజ్ గిరి, ఆయన కుమారుడు రోహిత్ కు మెదక్ సీట్లు కేటాయించనున్నారు. మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్ కూడా రాహుల్ గాంధీని కలిశారు. భవిష్యత్తులో పార్టీ మంచి అవకాశం కల్పిస్తుందని ఆయనకు రాహుల్ భరోసా ఇచ్చారు. పీసీసీ రేవంత్ రెడ్డి స్వయంగా శ్రీధర్ ను రాహుల్ దగ్గరకు తీసుకెళ్లారు. మల్కాజ్ గిరి ఎంపీ స్థానాన్ని నందికంటి శ్రీధర్ కు ఇవ్వనున్నట్లు సమాచారం. మరో వైపు నకిరేకల్ కాంగ్రెస్ టికెట్ ను వేముల వీరేశానికి ఖరారైనట్లు తెలుస్తోంది.