కిచెన్‌లో కేటీఆర్.. జొన్న రొట్టెలు, ఎగ్ భుర్జీ

వైరల్ ఫీవర్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంటింట్లో కాలక్షేపం చేస్తున్నారు. ఆయన ఎగ్ భుర్జీ తయారు చేస్తున్న ఫొటోలను కుమారుడు హిమాన్షు రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ, జొన్న రొట్టెల్లోకి ఎగ్ భుర్జీ వండుతున్నారని హిమాన్షు పేర్కొన్నారు. కేటీఆర్ అనారోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫొటోలను బయటపెట్టినట్లు సమాచారం.

#KTR #KTRNews #KTRCooking #EggBhurji #JowarRoti #HimanshuRao #BRS #TelanganaNews #TeluguNews #VSRBreakingNews
