కేసీఆర్ అసెంబ్లీకి రాడు.. హరీష్ రావు

రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం మాజీ మంత్రి,బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలను, పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఆయన మీడియాకు వివరించారు.
*మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్..*
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహమే జరిగింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, దళిత, గిరిజన, బీసీ వర్గాలను ఈ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది.
ప్రజా సమస్యల మీద సమగ్రంగా చర్చించడానికి కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ పక్షాన గట్టిగా డిమాండ్ చేయాలని నిర్ణయించాం.
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీళ్లున్నా కావాలనే ఎత్తిపోతలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తోంది.
కేసీఆర్ గారు 80 శాతం పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో చిన్న పని పూర్తి చేస్తే 60 టీఎంసీల నీళ్లు వస్తాయి, కానీ ప్రభుత్వం కక్షపూరితంగా దాన్ని గాలికొదిలేసింది.
ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారే స్వయంగా లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం.
22A కింద వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న తీరుపై, కరెంట్ కోతలు, రుణమాఫీ వైఫల్యం, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణి కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ ఫెయిల్యూర్ వంటి అన్ని అంశాలపైనా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతోంది. విద్యార్థుల పక్షాన అవసరమైతే సభను స్తంభింపజేసి అయినా న్యాయం జరిగేదాకా కొట్లాడుతాం.
పాలన చేతకాక, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్‌లో రేవంత్ రెడ్డి కేసీఆర్ రాజీనామా అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశాడు.
దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు ముందు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డే.
అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి లేదు.
ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రజల గుండెల్లో నిలిచిన మానవీయ నాయకుడు కేసీఆర్.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వాడుతున్న భాష బజారు భాషను తలపిస్తోంది.
బడ్వె, పైల్వాన్.. బట్టలిప్పి కొడతాడు, తిర్రేసి కొడతాడు అని అసెంబ్లీలో మాట్లాడటం చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది. అలాంటి గౌరవం లేని సభకు కేసీఆర్ గారు వెళ్లాల్సిన అవసరం లేదు.
ఈ చిల్లర ముఖ్యమంత్రితో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం అందరం ఏకగ్రీవంగా నిర్ణయించాం.
కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులం మేమున్నాం, మేమడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా రేవంత్ రెడ్డికి లేదు.
ప్రతిపక్ష నాయకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారి భద్రత మీద రేవంత్ రెడ్డికి ఏడుపెందుకు.
పక్క రాష్ట్రం ఏపీలో మాజీ సీఎంలకు భద్రత కల్పించడం లేదా.
కనీసం వార్డు మెంబర్ కూడా కాని నీ తమ్ముడు తిరుపతి రెడ్డికి 4 గురు గన్‌మెన్లు పెట్టి, భద్రత కోసం 40 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
చరిత్రలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి నేతల పట్ల అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినప్పుడు.. వాళ్లు సభను బహిష్కరించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ ముఖ్యమంత్రులుగా సభలోకి అడుగుపెట్టిన చరిత్ర ఉంది.
కేసీఆర్ గారి పట్ల కూడా కాంగ్రెస్ అలాగే ప్రవర్తిస్తోంది కాబట్టి ప్రజల నుంచే బుద్ధి చెబుతాం.
పొద్దున లేస్తే రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ చావును కోరుకునే రేవంత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు.
ఇందిరా పార్క్ దగ్గర రోజూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వీఆర్ఏలు, ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు.
వాళ్లకు సమాధానం చెప్పే దమ్ములేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.
