మల్లిఖార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని కలిశారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ నేపథ్యంలో ఖర్గేతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను సీఎం ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కొండా సురేఖ పైన చర్యలు, మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మరో వైపు 1000 రోజుల పాలన ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వ విజయాలు, ఇతర అంశాలను కూడా ఖర్గే కి ముఖ్యమంత్రి తెలిపారు.
