లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యూకే–అమెరికా పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం 12.30 am కి లండన్‌కు బయలుదేరారు.ఢిల్లీ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యులు డా. మల్లు రవి, తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, యూకే–అమెరికా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
