జగ్గారెడ్డి షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
1 min readసంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపైన కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. గత కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన బహిరంగ విమర్శలు చేస్తున్న ఆయన పైన ద్రుష్టి సారించింది. ఎన్ని హెచ్చరించినా ఆయన తీరు మారకపోవడంతో జగ్గారెడ్డికి హెచ్చరికలు జారీ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహారిస్తున్న ఆయనకు అప్పగించిన బాధ్యతలను పార్టీ వెనక్కి తీసుకుంది. పలు జిల్లాలతో పాటు పార్టీ అనుబంధ సంఘాలకు బాధ్యుడిగా జగ్గారెడ్డి ఉన్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు జగ్గారెడ్డి దగ్గర ఉన్న జిల్లాలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు కేటాయించారు.