మా బూట్లు నాకినా కేసీఆర్ ను దగ్గరకు రానివ్వం
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జాతీయస్థాయిలో ఫ్రెంట్ పేరుతో కేసీఆర్ బీజేపీకి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని గందరగోళ పర్చేందుకు చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ,కేటీఆర్,హరీష్ రావు మా పార్టీ నేతల బూట్లు నాకినా కాంగ్రెస్ దగ్గరకు రానివ్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కలవని రేవంత్ స్పష్టం చేస్తున్నారు. ఓటమి అంచున ఉన్న కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాంలో భాగంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపైన చర్చించారు.