జెసి దివాకర్ రెడ్డికి అవమానం

1 min read

మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి హైదరాబాద్ లో అవమానం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేనిదే ప్రగతి భవన్ లోకి అనుమతించమని తేల్చి చెప్పారు. ప్రగతి భవన్ గేట్ ముందు కారును నిలిపేశారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కనీసం కేటీఆర్ ను అయినా కలుస్తానని చెప్పినా ఖాకీలు వినలేదు. దీంతో జెసి దివాకర్ రెడ్డి వెను తిరగాల్సి వచ్చింది. నాలుగు దశాబ్దాలపైగా ఎంతో మంది ముఖ్యమంత్రులను అపాయింట్ మెంట్ లేకుండా కలిసిన దివాకర్ రెడ్డికి కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn