ఛాలెంజ్ ను నిలబెట్టుకున్న జగ్గారెడ్డి
1 min readసంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నారు. ఫిరాయింపుల పర్వం జోరుగా జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆయన కాపాడారు. మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య నిర్మలా జగ్గారెడ్డిని బరిలోకి దింపిన ఆయన చెప్పిన ప్రకారం ఓట్లు తీసుకువచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ కు ఉన్న 230 ఓట్లు కచ్చితంగా వచ్చేలా చేస్తానని , అలా చేయకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ఛాలెంజ్ చేశారు. దానికి తగ్గట్లుగానే నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు పోల్ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి తాము అనుకున్న ఓట్లు సాధించామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నైతికంగా కాంగ్రెస్ పార్టీతే విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకున్నదానికి కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ ఓట్లు భారీగా కాంగ్రెస్ కు క్రాస్ అయ్యాయి.