కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం.. కొండా మురళి

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం: కొండా మురళి

వరంగల్: కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయని, పోతుంటాయని.. కానీ తమ రక్తంలో కృతజ్ఞత ఉందని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

తన జీవితంలో ఎప్పుడూ ఎవరికీ సారీ చెప్పలేదని కొండా మురళి అన్నారు. కొండా సురేఖను సారీ చెప్పాలని కొందరు సూచించినప్పటికీ.. పదవి ఉంటే ఉంటుందని, పోతే పోతుందని భావించి తన భార్య సారీ చెప్పలేదని తెలిపారు.

కొండా సురేఖను గెలిపించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాత్ర ఎంతో ఉందని కొండా మురళి పేర్కొన్నారు.

పదవులు వస్తాయి.. పోతాయి.. కృతజ్ఞత మాత్రం ఉంటుంది

రాజకీయ పదవులు శాశ్వతం కాదని కొండా మురళి అన్నారు. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో తమ అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కేసీఆర్ టికెట్ ఇచ్చినా.. మంత్రిని ఓడించాం

గతంలో కేసీఆర్ టికెట్ ఇచ్చిన సందర్భాన్ని కొండా మురళి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించామని చెప్పారు.

వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో తాము గెలిచినందువల్లే ప్రజలు ప్రశాంతంగా జీవించారని, కొండా మురళి ఉన్నారనే ధైర్యంతోనే వరంగల్ ఈస్ట్ ప్రజలు ఉండేవారని కొండా సురేఖ పేర్కొన్నారు.

తరువాత వరంగల్ ఈస్ట్ స్థానాన్ని వదిలి పరకాల నియోజకవర్గానికి వచ్చినప్పటికీ ప్రజలు తనను గెలిపించారని సురేఖ గుర్తు చేసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn