బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సతీమణి

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత, కూమార్తె నైమీషా రెడ్డి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఎల్లమ్మ కల్యాణోత్సవం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
