పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన చంద్రబాబునాయుడు

డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. ముంబయిలో కుడి భుజానికి పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భుజం నొప్పి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు డాక్టర్లు ఆపరేషన్ చేశారు.
