బాల్క సుమన్ ను అరెస్ట్ చేయాలి

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్ విమర్శించారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపైన రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలను సుమోటో గా తీసుకుని కేసు నమోదు చేయాలని వారు కోరారు. బాల్క సుమన్ ఓ సంఘ విద్రోహ శక్తిగా తరహాలో మాట్లాడరని ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఆయనది మొదటి నుంచి నేర ప్రవృత్తేనని ధ్వజమెత్తారు.
బాల్క సుమన్ తన రాజకీయ ఎదుగుదల, స్వార్థం కోసం ఎంతో మంది జీవితాలను పణంగా పెట్టించాడని బల్మూర్ వెంకట్ నిప్పులు చెరిగారు.రెచ్చగొట్టి మీ జీవితాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల మసుగులో ఉన్నది బీఆర్ఎస్ నేతలేనని బల్మూర్ స్పష్టం చేశారు.
బాల్క సుమన్ ఒక ఉగ్రవాదిలా మాట్లాడరని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. శాంతిభద్రతలకు విఘాతం కల్లించేలా ఆయన వ్యాఖ్యలున్నాయరన్నారు. ప్రజల ఆటేన్షన్ డైవర్ట్ చేయడానికే ఆయన నీచంగా మాట్లాడారని నిప్పులు చెరిగారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణ ను టిఆర్ఎస్ గుండాలతో ఆస్తులను తగలబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్ వెనుక కుట్రదారులను బయటపెట్టాలని అద్దంకి దయాకర్ రాష్ట్ర డీజీపీ ని కోరారు.కేసిఆర్ ,కేటీఆర్ కు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉండి, ప్రజల బాగుండాలంటే తక్షణమే బాల్క సుమన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
