కేర‌ళ‌లో యూడీఎఫ్ దే భారీ విజ‌యం

కేర‌ళ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దుమ్మురేపుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ పైన ఆయ‌న విరుచుకుప‌డ్డారు. విజ‌య‌న్ నాకు రాసిన లేఖ‌లో 2014-23 మ‌ధ్య విష‌యాల‌ను ప్ర‌స్తావించారు.ఆ కాలంలో పిన‌రాయి విజ‌య‌న్ స‌న్నిహిత మిత్రుడు కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.ఆయ‌న లేఖ‌లోని త‌ప్పుల‌న్నీ జ‌రిగినందునే తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్‌ను మార్చివేశారుని సీఎం తేల్చి చెప్పారు. ఇప్పుడు విజ‌య‌న్‌ను కేర‌ళం ప్ర‌జ‌లు మార్చివేస్తారని,విజ‌య‌న్‌పై శ‌బ‌రిమ‌ల బంగారం చోరీ, బంగారం స్మ‌గ్లింగ్ కేసులున్నాయ‌న్నారు. విజ‌య‌న్ గాడ్‌ఫాద‌ర్ న‌రేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారని ఆయ‌న‌ మోదీనే ఈ కేసుల‌న్నింటి నుంచి విజ‌య‌న్‌ను ర‌క్షిస్తున్నారని తేల్చి చెప్పారు.

దేశం కోసం త‌మ జీవితాల‌ను, ఆస్తుల‌ను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని ర‌క‌ర‌కాల కేసుల‌తో వేధిస్తున్నారని,
కేజ్రీవాల్ స‌హా అనేక మంది నేత‌ల‌ను ఈడీ కేసుల‌తో వేధించి అరెస్టు చేసిన వాళ్లు ఎందుకు విజ‌య‌న్ జోలికి రావ‌డం లేదని సీఎం ప్ర‌శ్నించారు. న‌రేంద్ర మోదీ… విజ‌య‌న్ మ‌ధ్య ఉన్న అవ‌గాహ‌న‌తోనే కేసులు, అరెస్టులు లేవన్నారు.
కేర‌ళంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ విజ‌యం సాధించిందన్న సీఎం రేవంత్ రెడ్డి దానిని మేం అభినందిస్తున్నామ‌న్నారు.
కేరళంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ ఘ‌న‌త కాంగ్రెస్ ముఖ్య‌మంత్రులు క‌రుణాక‌ర‌న్‌, ఊమెన్ చాందీలదేన‌న్నారు.
పిన‌రాయి విజ‌య‌న్ హ‌యాం ముగిసిందని,120 నెల‌ల విజ‌య‌న్ పాల‌న కాలం వైఫ‌ల్యానికి ప్ర‌తీక‌గా నిలిచిందని వ్యాఖ్యానించారు. పిన‌రాయి విజ‌య‌న్ వైదొలిగే స‌మ‌యం ఆస‌న్న‌మైంది.మూడింట రెండొంతుల మెజారిటీతో యూడీఎఫ్ గెల‌వ‌బోతుంద‌న్న ఆశాభావాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn