మరక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన ఆయన ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈసా… మూసీ నదుల సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్నట్లు రక్షణ మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితభస్మాన్ని ఈసా… మూసీ సంగమ స్థలిలో నిమజ్జనం చేశారని ఆయన వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలియజేశారు. బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.
