మాజీ ఎమ్మెల్యే దొంతికి తప్పిన ముప్పు
1 min read
మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వరంగల్, హైదరాబాద్ హైవే మీద జనగామ సమీపంలో మాధవరెడ్డి కారు ఓ బైక్ ను ఢీకొట్టి గోతిలో పడింది. అయితే బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. కారు డ్రైవరుతో పాటు మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ కు తరలించారు. దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుంచి 2014లో స్వతంత్ర ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో మాధవరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.