తెలంగాణ యాసలో శుభలేఖ
1 min readతెలంగాణ యాసలో రూపొందించిన శుభలేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. అచ్చ తెలంగాణ భాషలో తయారు చేసిన వెడ్డింగ్ కార్డు కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయబోతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా లంబడిపల్లె గ్రామానికి చెందిన చందు తన పెళ్లి పత్రికను తెలంగాణ యాసలో ప్రింట్ చేయించాడు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ లో చందు పని చేస్తున్నాడు.