హైదరాబాద్ కు కెసి వేణుగోపాల్

తెలంగాణలో ఎన్నికలపైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ద్రుష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లోను గెలవాలని భావిస్తున్న హైకమాండ్ రాష్ట్ర నేతలను సమాయత్తం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చారు. పార్టీ కీలక నేతలతో ఆయన గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఎన్నికలపైన ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. మరో వైపు పార్టీ స్కినింగ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన దీపదాస్ మూన్షి కూడా పార్టీ నేతలతో గాంధీభవన్ లో భేటీ అయ్యారు.