రెఫరెండానికి మేం సిద్ధం.. రేవంత్ రెడ్డి
1 min readఉచిత కరెంటుపైన రెఫరెండానికి సిద్ధమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మంత్రి హరీష్ రావు ఛాలెంజ్ పైన ఆయన స్పందించారు. తెలంగాణలోని ఏ సబ్ స్టేషన్ పరిధిలోని రైతులతో 24 గంటల నిరంతరాయ కరెంటు పైన చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో పోటీ చేయడంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి సీట్లు ఇవ్వాలని ఆయన బీఆర్ఎస్ ను డిమాండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలపైన రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొడుకుల సీట్ల కోసం పోచారం, గుత్తా సిఎం కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన అనేక మందిని కేసీఆర్ తన మంత్రివర్గంలో ఎలా చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రాకు చెందిన మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి ఇచ్చిన కోటీ రూపాయలతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని ఆయన అన్నారు.