ఇదిగో ఆ ఫోన్లు.. కవిత ఛాలెంజ్

1 min read

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి ఛాలెంజ్ విసిరారు. ఈడీ తనపైన చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చెపుతున్న ఆమె ఈ సారి సాక్ష్యాధారాలతో బయటకు వచ్చారు. ఈడీ విచారణకు ఆమె తన సెల్ ఫోన్లతో హాజరయ్యారు. కవిత పలు ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. దానికి సంబంధించిన నెంబర్లు కూడా బహిర్గతం చేసింది. అయితే తానెలాంటి ఫోన్లను ధ్వంసం చేయలేదని కవిత స్పష్టం చేస్తూ వచ్చారు.తాజాగా ఆమె ఆ ఫోన్లను ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లారు. విచారణకు వెళ్లే ముందు మీడియాకు కవిత ఫోన్లను చూపించారు.

ఇదే సమయంలో ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను.ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ?దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ?నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే.తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు.తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది.రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn