కాంగ్రెస్ కు కిరణ్ గుడ్ బై
1 min readఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఉమ్మడి ఎపికి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించడంతో తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ప్రత్యేక పార్టీ పెట్టారు. అయితే 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలుకావడంతో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా తెరమరుగయ్యారు. కొంత కాలం క్రితం మళ్లీ కాంగ్రెస్ లో చేరినప్పటికి అంత యాక్టివ్ గా లేరు. తాజాగా ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తారా లేదా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా అన్నది చూడాలి.