హరీష్ రావు.. రాజీనామా లేఖ సిద్ధం చేసుకో..

1 min read

ఆగస్టు 15న రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తిరగాలని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం మరో సారి వరంగల్ సభలో తేల్చి చెప్పారు. భూకంపాలు, సునామీలు వచ్చినా రుణమాఫీ ఆగదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనని హరీష్ రావు సవాల్ విసిరారు. ఒక వేళ రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సవాల్ ను స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn