కాంగ్రెస్ లో విలీనం దిశగా వైఎస్ షర్మిల పార్టీ
1 min readకాంగ్రెస్ లో వైఎస్ షర్మిల పార్టీ విలీనం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో కలపడానికి ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే బెంగళూరులో ఉన్న ఆమె కర్ణాటక డీప్యూటీ సిఎం డీకె శివకుమార్ తో మంతనాలు జరిపినట్లు చెపుతున్నారు. డీకె సాయంతో విలీన ప్రక్రియకు అధిష్టానం మద్దతు కూడగట్టడానికి షర్మిల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని చెపుతున్నారు. అయితే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆమె ఎక్కడి నుంచి పనిచేస్తారన్న దానిపైన ఇప్పటికే స్పష్టత రాలేదు. తెలంగాణే తన రాజకీయవేదిక అని షర్మిల ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎక్కువ మంది ఆమెను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ఆమె ఆంధ్రా కాంగ్రెస్ లో పనిచేయాలని ఇప్పటికే సూచించారు. అయితే ఈ వివాదానికి పార్టీ అధిష్టానం ఎలా ముగింపు ఇస్తారో చూడాలి.