జనవరి 18న షర్మిల కుమారుడి పెళ్లి

ఫిబ్రవరి 17న తన కుమారుడి పెళ్లి జరగబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. జనవరి 18న నిశ్చితార్థం జరగనున్నది. పెళ్లి మొదటి ఆహ్వాన పత్రిక ను ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఉంచనున్నారు. జనవరి 2న కుటుంబ సమేతంగా ఇందు కోసం షర్మిల ఇడుపులపాయ వెళ్తున్నారు. వైఎస్ రాజారెడ్డి,అట్లూరి ప్రియ పెళ్లి విదేశాల్లో జరగనున్నట్లు సమాచారం. తన అన్న జగన్ తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెళ్లికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. తన అన్నను ఈ పెళ్లి కి ఆహ్వానిస్తారా లేదా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతోంది.

