బండి సంజయ్.. నాలుక చీరేస్తా
1 min read
ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తానని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఎన్నికల కోసం ఇష్టానుసారం మాట్లాడుతు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం చేతకాక రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని వినయ్ భాస్కర్ విమర్శించారు. ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్లకు గుళ్లు గోపురాలు గుర్తుకు వస్తాయని ఆయన అన్నారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.